Friday, September 11, 2026
Homeసంపాదకీయం'ఆత్మహత్యల' రహిత భారత్ ను నిర్మిద్దాం

‘ఆత్మహత్యల’ రహిత భారత్ ను నిర్మిద్దాం

📰 Generate e-Paper Clip

“సమస్యలనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే .జీవితమే సమస్య కాదు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు.ధైర్యంగా ముందుకు సాగు ” – స్వామి వివేకానంద

 

మనిషి‌‌ “జీవితంలో “అనుకున్న లక్ష్యాన్ని చేరుకోక పోవడం వల్ల తీవ్రఒత్తిడికి లోనై” ఆత్మహత్యలకు” పాల్పడటం ప్రపంచ మానవాళికి జటిల సామాజిక ప్రజారోగ్య సమస్యగా పరిణమించింది . “ప్రపంచ ఆరోగ్య సంస్థ” లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సగటున 7లక్షల మంది “ఆత్మహత్యలు” చేసుకుంటున్నారు. ఇందులో 15 నుండి 29 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నట్లు తేలింది. వారి మరణాలకు రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం ఆత్మహత్యలే అని అనేక అధ్యయనాల్లో తేలింది. చనిపోయే ముందు “ఒక క్షణం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే” పరిస్థితి మరో రకంగా వుండేది అని అంచనాలు తెలుపుతున్నాయి. ఆత్మహత్యల వల్లపెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ‘సామాజిక ‘సమస్యలతో కూరుకు పోయి ఆర్థికంగా కునారిల్లుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి .చిన్న కారణాలకే తమ ఉసురు తీసుకుంటున్నారు.(ఆత్మహత్య చేసుకుంటున్నారు) “ప్రపంచ ఆరోగ్య సంస్ధ” నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా యేటా 7 లక్షల మంది కి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందులో 77 శాతం కేసులు తక్కువ మధ్యఆదాయ దేశాలలో నమోదు అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.వ్యవసాయ రంగములో సంభవిస్తున్న అతివృష్టి అనావృష్టి పంటలకు పురుగు తగలడం ముఖ్యంగా పత్తి రైతులు ఆశించిన దిగుబడి రాక పంట నష్టము భరించలేక తాము పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించక పోవడం వల్ల పురుగుమందులు తాగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలు నియంత్రించవచ్చని “డబ్ల్యూటీవో” చెబుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏట సెప్టెంబర్ 10 తేదీన ఆత్మహత్యలనివారణ మీద అవగాహన చైతన్య సదస్సులు సమావేశాలు నిర్వహించి ఆత్మహత్య రహిత సమాజ స్థాపనకు ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు సామాజిక సంస్థలు పౌరసమాజం వైద్యులు ఆరోగ్య శాఖ సమిష్టిగా ఆత్మహత్యాల నివారణకు పలు అవగాహన చైతన్య సదస్సులు నిర్వహిస్తుంది.

యువతలోనిరాశ నిస్పృహలు

యువతలో పేరుకుపోయిన నిరాశ నిస్పృహలు ‘నిరుద్యోగం ‘ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం క్షీణించి అనారోగ్య సమస్యలను తట్టుకోలేక ,”ఆత్మహత్యలకు’ పాల్పడే శాతం ఎక్కువైంది.
రైతులు’ చేనేత కార్మికులు’ నిరుద్యోగులు ‘ పరిశ్రమలు మూతపడడం వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులు’ పరిక్షల్లో ఫెయిలైన విద్యార్థులలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ‘”ఆత్మహత్యలు చేసుకునేవాల్లలో యువకులే ఎక్కువ శాతం ఉంటున్నారు 15 నుండి 29 సంవత్సరాల వయసుగల వారు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు” .దీనికి కారణం ప్రేమవిఫలం కావడం . పెద్దలు మందలించారని .ఈ పని చేస్తుంటే మరికొందరు పని భారం పెరిగిందని. ఉద్యోగం రాలేదని .పరీక్షల్లో ఫేలయ్యామని పరువు పోయిందని ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. “డిప్రెషన్ మెంటల్” బ్యాలెన్స్” కోల్పోవడం.” ఆర్థిక సమస్యలు’ కుటుంబ కలహాలు పిల్లలశక్తి సామర్ధ్యాలు గుర్తించకుండా వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేయడం. టీవీ సోషల్ మీడియా ప్రభావం సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొలేని బలహీన మనస్తత్వం’ అత్తింటి వేధింపులు గృహహింస ‘ వరకట్నం ‘ఒత్తిడులు ‘చదువుల భారం ర్యాంకుల కోసం ఒత్తిడి “అనుమానాలు’ఈర్ష్యా ద్వేషాలు ‘అహం ‘ అవమానాలు బంధుత్వంలో వస్తున్న విభేదాలు. అప్పుల బాధలు ‘సమాజములో సూటి పోటి మాటలు ‘వెకిలి చేష్టలు భరించలేకపోవడం .ఆత్మీయులు దూరం కావడం. వారిని కోల్పోవడం ఇలాంటి పరిస్థితులు పలువురిని ఆత్మహత్యలకు పురికొలుపు తున్నాయి .అన్ని వయసుల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగాపురుషులలోనే ఆత్మహత్యలు రేటు ఎక్కువుంది

జీవితం పై” ఆశ”పునరుద్దరణ

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆత్మహత్యలు నివారించడానికి అంతర్జాతీయ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ తో కలిసి పనిచేస్తుంది .”కోవిడ్ మహమ్మారి” కారణంగాఏర్పడిన ఆర్థిక సామాజిక పరిస్థితులు మానసిక అనారోగ్యం ఒత్తిడి మానవాళినిపీడిస్తోంది .మానసిక అనారోగ్యం వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించడానికి “కనెక్ట్ కమ్యూనికేట్ మరియు సంరక్షణ “ద్వారా జీవితము పై ఆశను పునరుద్దరించడం
అనే ఆశయంతో పనిచేస్తుంది.
గత రెండు సంవత్సరాలుగా WHO తో కలిసి ” ఆత్మహత్యలను నివారించడానికి కలిసి పనిచేడం”కోవిడ్” కారణంగా పెరుగుతున్న ఆత్మహత్యల నివారణ ఆవశ్యకతపెరిగింది.

ఆత్మహత్యల నివారణ పై అవగాహన

ఆత్మహత్యలు ప్రజారోగ్య సమస్యగా పరిణమించి సమాజానికి సవాల్ గా నిలవడం శోచనీయం .
ఆత్మహత్యల మీద చర్చజరగాలి 1)ఆత్మహత్యల గురించి సమాజములో బహిరంగ చర్చ లేకపోవడంవల్ల ఆత్మహత్యల నివారణ లోఆశించిన ఫలితాలు రావడం లేదని పలు ఆరోగ్య సర్వేలు వెల్లడించాయి.
2)ఆత్మహత్యలు చేసుకునే వారి ప్రవర్తన పసిగట్టడం వారిని గుర్తించడం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చును.3) ఆత్మనిర్భరత మీదఅవగాన కలిగించడం. మానసిక ఆరోగ్య అక్షరాస్యతను విస్తరించే కార్యాచరణతో మనోబలాన్ని పెంపొందించే సామాజిక సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం పౌరసమాజం పూనుకోవాలి .

పెరుగుతున్న ఆత్మహత్యలు

దేశములో వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
2015 నుండి ప్రతి యేటా ఆత్మహత్యల కేసులు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం
2018 తో పోలిస్తే దేశం మొత్తములో139123ఆత్మహత్యలు నమోదైనాయి .2018 తోపోలిస్తే 3 .4 శాతం పెరిగాయి. 2019 లో ఆత్మహత్యల రేటు0.2 శాతం పెరిగింది.

రాష్ట్రాల వారీగా ఆత్మహత్యలు

మహరాష్ట్ర ఆత్యదిక ఆత్మహత్యలు 18’916(13.6 శాతం)
తమిళనాడు లో13’493(9.7 శాతం)
పశ్చిమ బెంగాల్ లో12457(9.1 శాతం)
కర్ణాటక లో11288 ఆత్మహత్యలు(8.1శాతం)
జరిగాయి.నమోదైన కేసుల్లో ఈ‌ఐదు రాష్ట్రాలలో కలిసి 49.5 శాతం ఉన్నాయి.
*2018 సంవత్సరం తోపోలిస్తే 2019 లో ఆత్మహత్యలు 3.4 శాతం పెరిగాయి.వీరిలో ఎక్కువ మంది కుటుంబ తగాదాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలకు రెండో కారణము ఆనారోగ్యం పెళ్లికి సంబంధించిన ఇబ్బందులతో ఆత్మహత్యలకు పలుపడిన వారు 3వ స్థానం ప్రేమ వ్యవహారాల వల్ల మరణించిన వారు 4 వ స్థానములో ఉన్నారు.మత్తుమందుల ( డుగ్స్) వల్ల మరణించినవారు5వ స్థానములో ఉన్నారు.
ఆత్మహత్యల నివారణ
జీవితము పై ఆశను కలిగించాలి*
జీవితము పై అవగాహన ఆశను పెంచడం.జీవిత విలువలను జీవన నైపుణ్యాలు పెంచడం.
వ్యక్తిలోఆశను ప్రోత్సాహించడం ద్వారా ఆత్మహత్య ఆలోచనను మార్చడం ద్వారా ఆత్మహత్యల రహిత సమాజాన్ని నిర్మించవచ్చు.
జీవిత ఆశయాలు నెరవేర్చుకున్న వ్యక్తుల జీవితచరిత్రలను వారి విజయగాధలను చదవాలి.
ధైర్యం సాహసం మనోబలం సంకల్పబలం పెంపొందించే
కథలను సంఘటనలు తెలియచేయడం ద్వారా ఆత్మహత్యలను ఆపవచ్చును.
కష్టాలను ఇష్టంగాఎదురుకునే మనోధైర్యం వజ్ర సంకల్పం వ్యక్తుల్లో కలిగించాలి.
ప్రజల్లో విశ్వాసం వెలుగును ప్రేరేపించే లక్ష్యంగా కుటుంబ సభ్యులు పౌరసమజం స్వచ్ఛంద సంస్థలు మహిళా సంఘాలు యువజన సంఘం పనిచేయాలి.
ఆత్మహత్య సంక్షోభాన్ని ఎదురుకుంటున్న వారికి మాట ఓపికగా వినాలి .ఆత్మీయ పలకరింపు తో మంచి మాటలతో బతుకు మీద బరోసా భద్రత అవసరమైన మద్దతు పౌరసమాజం
ఇవ్వాలి.
ఆత్మహత్యల ఆలోచనలను అందుకు దారితీసే కారణాలు పరిస్థితులు సంక్లిష్టంగా వుంటాయి.
ఆందోళన డిప్రెషన్ లాంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు ఆత్మహత్యలకు కారణమవుతాయి.
ఒంటరి తనం మానసిక దుర్బలత్వం తో బాద పడే వారిని గుర్తించి వారి పట్ల శ్రద్ద చూపాలి.క
స్నేహితుల తో తాము పడుతున్న బాధలు షేర్ చేసుకోవాలి.స్నేహితుల సన్నిహితుల సంతోషాలలో భాగస్వాములు కావాలి
జీవితము పైఆశనుపెంచాలి. అత్యాశను తుంచాలి.
ఆత్మహత్య ఆలోచనలు అనుభవాలు చెబితే వినడానికి సమయం స్థలం కేటాయించడం ద్వారా వారిలో ఆత్మహత్య ఆలోచనలు తగ్గుతాయి. వారి ఆలోచనని మల్లించాలి.చిన్న చర్చ జీవితాలను కాపడగలడు.వ్యక్తిలో ఆశను సృష్టిస్తుంది.
కొత్త విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి .అప్పుడు మనలో వున్న.నెగెటివ్ ఆలోచనలు తగ్గుముఖం పడతాయి స్వాంతన చేకూరుతుంది.
నెగెటివ్ ఆలోచనలకు స్వస్తి పలకాలి .సంకల్పం మనోధైర్యం తోముందుకు వెళ్లే నైజం పెంచుకోవాలి.
రోజు’ వ్యాయామం’ యోగ వాకింగ్ ‘జాగింగ్ ‘మెడిటేషన్’ పుస్తకపఠనం
మెదడుకు మంచి వ్యాయామం.మెదడులోని న్నురాన్ “న్నూరనులు” ఆరోగ్యంగా వుంటే నెగెటివ్ ఆలోచనలు తగ్గుతాయి ఈ స్థితి ఆత్మహత్యల నివారణ దోహదపడుతుంది.
ఆత్మహత్య చేసుకునే అవకాశం వున్నవారిని జాగ్రత్తగా గమనించాలి.
పురుగుమందులు తుపాకులు ఆయుధాలు కొన్ని రకాల మందులు వారికి అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలి. ‘నూతన విద్యా విధానంలో యోగ మెడిటేషన్ తప్పని సరిగా ప్రవేశ పెట్టాలి.
పాటశాల కళాశాల స్థాయిలో
మానవీయ విలువలు మానసిక శాస్త్రాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి.”
పౌరసమాజం ప్రభుత్వం’ సామాజిక స్వచ్ఛంద ధార్మిక సంస్థలు విద్య ఆరోగ్య శాఖ సమిష్టిగా జీవన విలువలు మానసిక ఆరోగ్య అక్షాస్యత విస్తరణ “అందరికీ ఆరోగ్యం “కార్యాచరణతో ఆత్మహత్యలను
నివారణకు ఉద్యమించి
ఆత్మహత్యల రహితభారత్ నిర్మాణానికి సమాజం పునరంకితం కావాలి.

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
తెలంగాణ వికాస వేదిక
రచయిత కాలమిస్ట్
కరీంనగర్
9440245771

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!