Friday, August 28, 2026
Homeక్రీడలురోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ఇవ్వనున్నారంటూ వస్తున్న వార్తలపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. రోహిత్ రిటైర్‌మెంట్‌ను సంతోషంగా జరుపుకోవాలన్నారు.

టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగే వన్డేనే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్‌మెంట్ వార్తలపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఏదో ఒక సమయంలో అందరూ ఆటను వదిలేయాల్సిందేనని, ఎందుకు విచారం అంటూ కపిల్ దేవ్ ప్రశ్నించారు.

ఓ జాతీయ మీడియాతో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్ అయినా.. దాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. ఇన్నేళ్లుగా తనదైన ఆటతో క్రికెట్ ప్రియులను రోహిత్ శర్మ అలరించాడన్నారు. ‘అతడి రిటైర్మెంట్ పై వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలియదు. ఒకవేళ నిజమే అయినా.. మనం సంతోషంగా ఉందాం. ఎందుకు బాధపడాలి?. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆటకు వీడ్కోలు చెప్పాల్సిందే. సునీల్ గావస్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ వంటి క్రికెటర్లు వెళ్లిపోయారు. ప్రతిఒక్కరూ ఆటను వదలి వెళ్లాల్సిందే’ అని కపిల్ దేవ్ అన్నారు.

రోహిత్ ఘనంగా వీడ్కోలు పలుకుతాడని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండటంతో, అతని రిటైర్‌మెంట్ గురించిన చర్చలు ఊపందుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!