Thursday, August 6, 2026
Homeతెలంగాణసిద్ధిపేటకలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, ఆగస్టు 6 (చైతన్యగళం):

సిద్దిపేట ఐడీఓసీ సముదాయంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) డి. నాగరాజమ్మ, ప్రత్యేక ఉప కలెక్టర్ విజయలక్ష్మి హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సయ్యద్ రఫీక్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.డి. హమీద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!