Saturday, August 29, 2026
Homeసంపాదకీయంఉపసర్పంచ్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం

ఉపసర్పంచ్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం

📰 Generate e-Paper Clip

తాగునీరు, వీధి దీపాలు, గ్రామాభివృద్ధి అంశాలపై చర్చ – పలు తీర్మానాలకు ఆమోదం

హుస్నాబాద్, జూలై 18 (చైతన్యగళం ):
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపసర్పంచ్ సింగరయ్య అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, వీధి విద్యుత్ దీపాల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యుల సూచనల మేరకు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు సమావేశంలో మొదటి వార్డు సభ్యుడు ఉప్పరపల్లి శ్రీనివాస్, రెండో వార్డు సభ్యురాలు దానవేని లత–రమేష్, నాలుగో వార్డు సభ్యుడు పిల్లి సతీష్, ఆరవ వార్డు సభ్యురాలు వేముల విజయ–కనకయ్య, ఏడో వార్డు సభ్యురాలు బైరి మానస–సాయికృష్ణ, ఎనిమిదో వార్డు సభ్యురాలు పిల్లి రజిని–శ్రీకాంత్, తొమ్మిదో వార్డు సభ్యుడు కానిశెట్టి వీరయ్య, పదో వార్డు సభ్యుడు శివరాత్రి ఎల్లం, 11వ వార్డు సభ్యుడు వేల్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!