ఉపసర్పంచ్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం

తాగునీరు, వీధి దీపాలు, గ్రామాభివృద్ధి అంశాలపై చర్చ – పలు తీర్మానాలకు ఆమోదం హుస్నాబాద్, జూలై 18 (చైతన్యగళం ): సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపసర్పంచ్ సింగరయ్య అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, వీధి విద్యుత్ దీపాల మరమ్మతులు, పారిశుద్ధ్య...