కరీంనగర్ , జూలై 16 (చైతన్యగళం):
విద్యుత్ లైన్ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈఎం లావణ్య తెలిపారు.
11 కేవీ గీతాభవన్ ఫీడర్‌పై లైన్ నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో మంకమ్మతోట, రామ్‌నగర్, పద్మనగర్, పరమిత పాఠశాల ప్రాంతం, రాజీవ్ పార్క్, ధంగర్‌వాడి పాఠశాల ప్రాంతం, లేబర్ అడ్డా రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
అలాగే, 11 కేవీ ఐబీ ఫీడర్ పరిధిలో లైన్ నిర్వహణ పనుల నిమిత్తం మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 4:00 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయంలో కోర్టు చౌరస్తా, పాత డీఐజీ భవన ప్రాంతం, ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్ ఏరియా, పద్మనాయక కల్యాణ మండపం ప్రాంతంల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
విద్యుత్ సరఫరా అంతరాయం కలిగే సమయంలో వినియోగదారులు సహకరించాలని ఏడీఈఎం లావణ్య ఒక ప్రకటనలో కోరారు.
