కరీంనగర్‌లో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
కరీంనగర్ , జూలై 16 (చైతన్యగళం): విద్యుత్ లైన్ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈఎం లావణ్య తెలిపారు. 11 కేవీ గీతాభవన్ ఫీడర్‌పై లైన్ నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో మంకమ్మతోట, రామ్‌నగర్, పద్మనగర్, పరమిత పాఠశాల ప్రాంతం, రాజీవ్ పార్క్, ధంగర్‌వాడి పాఠశాల ప్రాంతం, లేబర్ అడ్డా రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. అలాగే,...