Wednesday, July 15, 2026
Homeతెలంగాణకరీంనగర్రేపు కరీంనగర్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

రేపు కరీంనగర్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం):
లైన్ నిర్వహణ పనుల కారణంగా జూలై 15న కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కాపువాడ ఫీడర్ పరిధిలోని కాపువాడ, మారుతీనగర్ చౌరస్తా, అశోక్‌నగర్, అహ్మద్‌పురా, పాత బజార్, మంగలి వాడ, శివాలయం, బొమ్మకల్ చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది.

అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు గోదాం గడ్డ ఫీడర్ పరిధిలో సప్తగిరి హిల్స్, తాహెరా మసీదు, సంతోషిమాత ఆలయం, శ్రీనగర్ కాలనీ, భవానీ కాలనీ, మల్లికార్జున కాలనీ, జానకి వీధి అపార్ట్‌మెంట్లు, అంజనాద్రి దేవాలయం, ధోబీ ఘాట్, గోదాం గడ్డ, బీఎస్ఎఫ్ క్వార్టర్స్, జెడ్పి క్వార్టర్స్, భగత్‌నగర్, మల్లమ్మ మార్కెట్, రఘుపతి రెడ్డి హాస్పిటల్ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేయబడుతుంది.

ఇక ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో మార్కండేయనగర్, పద్మనగర్, ఇండస్ట్రియల్ ఏరియా, ప్రగతి నగర్, లారెల్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని, పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ పునరుద్ధరించబడుతుందని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!