Monday, August 24, 2026
Homeతెలంగాణకరీంనగర్ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం):

ఆషాడమాసం సందర్భంగా కరీంనగర్ భగత్‌నగర్‌లోని గోదాంగడ్డలో పోచమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సునీల్ రావు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనం ఎత్తి అందరి దృష్టిని ఆకర్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపులో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన ఈ బోనాల పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి–మొండయ్య, రజక సంఘ సభ్యులు కొమురయ్య, మహేష్, లక్ష్మణ్, చంద్రయ్య మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!