Wednesday, July 15, 2026
Homeతెలంగాణఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం

ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

గంగాధర,జూలై 14 (చైతన్యగళం):

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఈరోజు రామడుగు మండలం గోపాలరావుపేట్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ సీనియర్ నాయకులు సీపేల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ హాజరై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితక్క నాయకత్వంలో ప్రజలకు ఉచిత విద్య ,ఉచిత వైద్యం, రైతే రాజు నియామకాలు, సామాజిక తెలంగాణనే లక్ష్యంగా పాంచ జన్య పథకాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే నాయకురాలు కవితక్క అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసే ఏకైక నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది కవితక్క అని అన్నారు. బీసీ నినాదాన్ని ఎత్తుకున్న నాయకురాలు కవితక్క అని వారు అన్నారు. రేపు కవితక్క పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి వస్తే సబ్బండ వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వారు అన్నారు. ఈనెల 20వ తారీకున రామగుండంలోని సింగరేణి కార్మికుల కోసం కవితక్క తలపెట్టే నిరాహార దీక్షలో తెలంగాణ రక్షణ సేన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చోప్పదండి నియోజకవర్గ ఇంచార్జి &జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, సీనియర్ నాయకులు గుండేటి తిరుపతి, పిట్టల సత్యం, గాలి పెళ్లి రత్నాకర చారి, బీసీ విభాగo అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, సీనియర్ నాయకులు మానకోండూర్ ఇంచార్జి బుడిగె పరుశురాం గౌడ్, బాసవేణి రాజేందర్, రవి శంకర్ బాబు రాజు శ్రీకాంత్ రవి శంకరయ్య స్వామి మదు తిరుపతి శేఖర్ రాజు రాజు మల్లయ్య సుదాకర్ మధు మహిళా నాయకురాలు ధ్యావ శారద, మొదలగువారు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!