Monday, August 10, 2026
Homeతెలంగాణమర్రిగూడలో ఏటీఎం కోసం ప్రజల వినతి – మేనేజర్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం

మర్రిగూడలో ఏటీఎం కోసం ప్రజల వినతి – మేనేజర్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం

📰 Generate e-Paper Clip

మర్రిగూడ, ఆగస్టు 4 (చైతన్యగళం):
మర్రిగూడ మండల కేంద్రంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమావత్ శీను నాయక్ మండల ప్రజల తరఫున గళమెత్తారు.

మర్రిగూడ మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా, రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, యువకులు రోజువారీ లావాదేవీల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉన్నప్పటికీ, ఏటీఎంలు లేక ప్రజలు నగదు కోసం మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.

ఈ సమస్యపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన శీను నాయక్‌తో బ్యాంక్ మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేయడం హేయం. తక్షణమే ఏటీఎం ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!