Friday, July 10, 2026
Homeతెలంగాణఈశ్వరమ్మ యాదవ్ ను సత్కరించిన ప్రెస్ కాలనీ సభ్యులు

ఈశ్వరమ్మ యాదవ్ ను సత్కరించిన ప్రెస్ కాలనీ సభ్యులు

📰 Generate e-Paper Clip

మన్సురాబాద్, జూలై 10 (నీలగిరి ఎక్స్‌ప్రెస్):
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ను ప్రెస్ కాలనీ సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది.మన్సురాబాద్ డివిజన్‌కు చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆలయ కమిటీ సభ్యురాలిగా నియమించగా, ఈ సందర్భంగా ప్రెస్ కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు జాల కిషన్, అధ్యక్షుడు ఎం. యాదగిరి యాదవ్, ప్రధాన కార్యదర్శి సోమ సుభాష్ ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా జాల కిషన్ మాట్లాడుతూ – నాలుగు దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్న ఈశ్వరమ్మ యాదవ్ ఈ పదవికి అన్ని విధాలుగా అర్హురాలని అన్నారు. గతంలో ఆమె మున్సిపల్ కౌన్సిలర్‌గా, కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా సేవలు అందించారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగబోయిన భాస్కర్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోచబోయిన కృష్ణ యాదవ్, పోచబోయిన సురేష్ యాదవ్, సీనియర్ జర్నలిస్టులు నెల్లుట్ల రాధా మనోహర్ రావు, ఉగ్రరూపం తానాజీ, తెలంగాణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!