ఎలిగేడు, ఆగస్టు 1 (చైతన్యగళం):
ఎలిగేడు మండలంలోని రాములపల్లి MPPs పాఠశాలలో శనివారం సర్పంచ్ సిద్ది తిరుపతి యాదవ్ అధ్యక్షతన బాలల గ్రామసభను నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “గ్రామంలోని ఆరు సంవత్సరాలు నిండిన ప్రతి బాలుడు పాఠశాలలో తప్పనిసరిగా నమోదు కావాలి. పాఠశాల ద్వారానే పిల్లలకు మానసిక, శారీరక, నైతిక ఎదుగుదల లభిస్తుంది. బాల్యాన్ని ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సంతోషంగా గడపాలి. వారి హక్కులను భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించకూడదు” అని సూచించారు.
గ్రామసభలో పిల్లల హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలల సంక్షేమంపై చర్చ సాగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి పిల్లల భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి, ఉప సర్పంచ్ తీట్ల విద్యాలత విజయ్, వార్డు సభ్యులు తిట్ల సింధుజ పరశురాం, రాజ్ కుమార్, కోట సందీప్, తిరుపతి, గోళ్లే శృతి, బత్తుల రాజమ్మ, చిన్నగంట మల్లమ్మ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
