ఈశ్వరమ్మ యాదవ్ ను సత్కరించిన ప్రెస్ కాలనీ సభ్యులు
మన్సురాబాద్, జూలై 10 (నీలగిరి ఎక్స్‌ప్రెస్): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ను ప్రెస్ కాలనీ సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది.మన్సురాబాద్ డివిజన్‌కు చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆలయ కమిటీ సభ్యురాలిగా నియమించగా, ఈ సందర్భంగా ప్రెస్ కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు జాల కిషన్, అధ్యక్షుడు ఎం. యాదగిరి యాదవ్, ప్రధాన కార్యదర్శి సోమ సుభాష్ ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా జాల కిషన్ మాట్లాడుతూ – నాలుగు...