Tuesday, June 30, 2026
Homeతెలంగాణసిఎంఆర్ఎఫ్ చెక్కులతో నిరుపేదలకు భరోసా

సిఎంఆర్ఎఫ్ చెక్కులతో నిరుపేదలకు భరోసా

📰 Generate e-Paper Clip

కురవి, జూన్ 29 (చైతన్యగళం‌):
నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని సర్పంచ్ రెంటాల కృష్ణ అన్నారు.కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన రాసమల్ల ఉప్పలయ్య, అక్కినపల్లి సైదమ్మ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం సిఎంఆర్ఎఫ్ సహాయ నిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు సహకారంతో ఈ చెక్కులను సర్పంచ్ రెంటాల కృష్ణ, ఉప సర్పంచ్ కృష్ణమూర్తి కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు కూడా తిరిగి డబ్బులు అందించి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం” అని తెలిపారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ముస్తఫా, కరుణాకర్, ఉప్పలయ్య, సత్తిరెడ్డి, దీపక్ గౌడ్, అఫ్జల్, మల్లయ్య, యాదయ్య, రాములు, వార్డు సభ్యులు తోట రాములు, ఎడ్ల ఉప్పలయ్య, జానీబీ, కాయిత వెంకన్న, కాలనీవాసులు ఇద్దయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!