- బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం):
కరీంనగర్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనల ప్రభావంతో, కరీంనగర్‌లోనూ కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.
కార్యాలయం వైపు దూసుకొచ్చిన కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, నినాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బీజేపీ నాయకులు కాంగ్రెస్ తీరును నిరసిస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నినాదాలు చేశారు.
జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “దేశంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. బీజేపీతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తాం… ఖబర్దార్!” అని హెచ్చరించారు.
