పెద్దపల్లి, జూలై 22 (చైతన్యగళం):
రామగిరి మండలం సెంటనర్ కాలనీలో విలేకరులతో మాట్లాడిన బీజేపీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆయన మాట్లాడుతూ, “రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం విడ్డూరం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడంలో విఫలమైంది” అని అన్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వాలని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్ రూ. 4000, వికలాంగులకు రూ. 6000 చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.“ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేనిపక్షంలో మహిళలు, వృద్ధులు, వికలాంగులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని మొలుమూరి శ్రీనివాస్ హెచ్చరించారు.
