Friday, June 26, 2026
Homeతెలంగాణవాసవి మాత ఆలయంలో 11వ వార్షికోత్సవ పూజలు

వాసవి మాత ఆలయంలో 11వ వార్షికోత్సవ పూజలు

📰 Generate e-Paper Clip

నాగర్‌కర్నూల్, జూన్ 25 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం అంగరంగ వైభవంగా 11వ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు బిల్లకంటి హరిబాబు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మిడిదొడ్డి అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఆర్యవైశ్యులు విశేషంగా హాజరయ్యారు.

ఆలయంలో ప్రధాన మూలమూర్తికి మహాభిషేకం, ధ్వజారోహణం, గోపూజ, గణపతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవగ్రహ, క్షేత్రపాలక, వాస్తు మండప దేవతలను ఆహ్వానించి ఉత్సవమూర్తికి పవిత్ర జలాలతో కలశాభిషేకం చేశారు. సుబ్రహ్మణ్యం మూలమంత్ర హోమం, నవగ్రహ పూజలు, కుంకుమార్చన అనంతరం మహానీరాజనం సమర్పించారు.పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని వాసవి మాత ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!