వాసవి మాత ఆలయంలో 11వ వార్షికోత్సవ పూజలు

నాగర్‌కర్నూల్, జూన్ 25 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం అంగరంగ వైభవంగా 11వ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు బిల్లకంటి హరిబాబు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మిడిదొడ్డి అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఆర్యవైశ్యులు విశేషంగా హాజరయ్యారు. ఆలయంలో ప్రధాన మూలమూర్తికి మహాభిషేకం, ధ్వజారోహణం, గోపూజ, గణపతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవగ్రహ, క్షేత్రపాలక, వాస్తు మండప దేవతలను ఆహ్వానించి ఉత్సవమూర్తికి పవిత్ర జలాలతో కలశాభిషేకం చేశారు. సుబ్రహ్మణ్యం మూలమంత్ర...