కరీంనగర్ , ఆగస్టు 25 (చైతన్య గళం): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్‌లో చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో పలువురు నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్లి దీక్షలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాక విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థులకు అండగా నిలిచి రామచందర్ రావు నేతృత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గంగాడి, రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, గుర్రాల వెంకట్ రెడ్డి, పుప్పాల రఘు, బారి జితేందర్, నరసింహ రాజు, గుంజెటి శివ, నేరెడ్ల ప్రవీణ్ రెడ్డి, సంగా నరేష్, ఆకుల రాజేందర్, మోతే గంగారెడ్డి, కరివేద మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
