Wednesday, August 26, 2026
Homeతెలంగాణప్రతిభ ఉపకార వేతన పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగింపు

ప్రతిభ ఉపకార వేతన పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగింపు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, ఆగస్టు 25 (చైతన్య గళం):

జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా ఉపకార వేతన పథకం కింద 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ ఎయిడెడ్, వసతి సౌకర్యం లేని మోడల్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు **సెప్టెంబర్ 1లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సెప్టెంబర్ 3లోగా  ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రతులను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు సాధారణ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రయ్య కోరారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!