Friday, July 17, 2026
Homeతెలంగాణదేవాలయానికి దూరంగా రోడ్డు నిర్మాణం చేయాలని వినతి

దేవాలయానికి దూరంగా రోడ్డు నిర్మాణం చేయాలని వినతి

📰 Generate e-Paper Clip

ఇబ్రహింపట్నం, జూలై 16 (చైతన్యగళం):
యాచారం మండలం మేడిపల్లి గ్రామ శివారులోని హనుమాన్ దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్న టీజీఐఐసీ అధికారులు దేవాలయం వద్ద మట్టి పోసి డోజర్‌తో లెవెలింగ్ చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది.గ్రామస్థులు “దేవాలయం వరకు రోడ్డు వద్దు, మతపరమైన భావాలను దెబ్బతీయకూడదు” అని వినతిపత్రం సమర్పించారు. మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఈ విషయాన్ని వెంటనే ఇబ్రహింపట్నం ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణం దేవాలయానికి దూరంగా జరగాలని సూచించారు.గురువారం గ్రామస్థులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. “రోడ్డు నిర్మాణం అవసరం, కానీ దేవాలయ విగ్రహం వరకు తీసుకురావడం సరైన పద్ధతి కాదు. దేవాలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి” అని వారు పేర్కొన్నారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రోడ్డు నిర్మాణం జరిగితే ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లోకేష్ ఉప్ప, సర్పంచ్ బాలు, మధు, రాజేందర్, శ్రీను, భీమ్లాల్, మలేష్, నారియా, పీ.ఆర్.జీ ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!