దేవాలయానికి దూరంగా రోడ్డు నిర్మాణం చేయాలని వినతి

ఇబ్రహింపట్నం, జూలై 16 (చైతన్యగళం): యాచారం మండలం మేడిపల్లి గ్రామ శివారులోని హనుమాన్ దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్న టీజీఐఐసీ అధికారులు దేవాలయం వద్ద మట్టి పోసి డోజర్‌తో లెవెలింగ్ చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది.గ్రామస్థులు “దేవాలయం వరకు రోడ్డు వద్దు, మతపరమైన భావాలను దెబ్బతీయకూడదు” అని వినతిపత్రం సమర్పించారు. మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఈ విషయాన్ని వెంటనే ఇబ్రహింపట్నం ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణం దేవాలయానికి దూరంగా జరగాలని సూచించారు.గురువారం గ్రామస్థులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి...