ఇబ్రహింపట్నం, జూలై 16 (చైతన్యగళం): యాచారం మండలం సాగర్ రోడ్డు తక్కల్లపల్లి గేట్టు నుంచి మేడిపల్లి శివారు లో ఉన్న హనుమాన్ దేవాలయం వరకు టీజీఐఐసీ వారు రోడ్డు నిర్మాణం చేస్తున్న బీటీ రోడ్డును పల్లె చెల్కతండా వరకు పొడిగించాలి అని పల్లెచెల్క తండా సర్పంచ్ విస్లావత్ నీలవతి లోకేష్ నాయక్ ఆధ్వర్యంలో ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సానుకూలంగా స్పందించారు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లోకేష్ నాయక్ మాట్లాడుతూ … మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న హనుమాన్ దేవాలయం నుంచి పల్లెచెల్క తండా వరకు సుమారుగా 2కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నీ క్యాంపు కార్యాలయంలో కలసి కోరడం జరిగింది. వారు సానుకూల స్పందించారు అని తెలిపారు. ఎమ్మెల్యే స్పందించి నందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్లెచెల్క తండా ఉప్ప సర్పంచ్ బాలు , మధు రాజేందర్ , శ్రీను , భీమ్లాల్ , బాలు , మలేష్ , మాధు, పీ.ఆర్.జీ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త తదితరులు ఉన్నారు.
