Wednesday, July 15, 2026
Homeస్పోర్ట్స్ఘనంగా చెస్ టోర్నీ కరపత్రం ఆవిష్కరణ

ఘనంగా చెస్ టోర్నీ కరపత్రం ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ఎలిగేడు, జూలై 14 (చైతన్యగళం‌): ఈనెల 18, 19 తేదీలలో కరీంనగర్‌లోని నీ వీ కన్వెన్షన్ ఈసీ హాల్లో జరగనున్న 4వ ఆల్ ఇండియా ఓపెన్ మరియు జూనియర్స్ చెస్ పోటీలు కరపత్రాలను మంగళవారం ఎలిగేడు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్ కప్పల ప్రవీణ్, ఉప సర్పంచ్ ముంజం నరేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ, “చదరంగం ఆటతో మేధాశక్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ అలవాటు పడుతుంది. ఈ టోర్నమెంట్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.టోర్నీ ఆర్గనైజర్, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్, సీనియర్ కోచ్ కంకటి అనూప్ కుమార్ మాట్లాడుతూ, “కరీంనగర్‌లోనే మొట్టమొదటిసారిగా రూ.1,25,000 నగదు బహుమతులు, 100 మెమెంటోలు, చిన్నారులకు మెడల్స్ అందజేయనున్నాం. పాల్గొనే క్రీడాకారులు, తల్లిదండ్రులకు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాం” అని తెలిపారు. ఆసక్తి కలవారు 8341206989, 9160160161 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముంజం నరేష్, మాజీ ఉప సర్పంచ్ గుడుగుల మహేందర్, వార్డు సభ్యులు మామిడాల రమేష్, విద్యా కమిటీ మాజీ చైర్మన్ అడ్డగుంట తిరుపతి గౌడ్, జిల్లా డెమొక్రటిక్ చెస్ అసోసియేషన్ కార్యదర్శులు కంకటి సృజన్ కుమార్, తాటిపల్లి సతీష్ బాబు, నాయకులు దగ్గుల శ్రీనివాస్, కోట శ్రీకాంత్, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, కట్ల ప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!