కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం): రేపు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు 11KV కాపువాడ ఫీడర్పై లైన్ నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
ఈ సందర్భంగా ఏడీఈ (టౌన్–1) పి. శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు కాపువాడ, మారుతీనగర్ చౌరస్తా, అశోక్‌నగర్, అహ్మద్‌పురా, పాత బజార్, మంగలి వాడ, శివాలయం, బొమ్మకల్ చౌరస్తా అని పేర్కొన్నారు.
వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
