Wednesday, July 15, 2026
Homeస్పోర్ట్స్ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

📰 Generate e-Paper Clip

విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు మూడు వన్డేల కోసం సిద్ధమవుతోంది. మరికాసేపట్లో బర్మింగ్‌హామ్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జాతీయ జట్టులోకి రావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం.

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 20 ఇన్నింగ్స్‌ల్లో 648 పరుగులు సాధించాడు. ఆ తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 17 మ్యాచ్‌ల్లో 639 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 613 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై 16 ఇన్నింగ్స్‌ల్లో 581 పరుగులు చేసిన కోహ్లీ.. మరో 68 పరుగులు సాధిస్తే ద్రవిడ్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్ కావడంతో కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టడం లాంఛనమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

రోహిత్ కూడా..

ఇంగ్లండ్‌పై అత్యధిక వన్డే పరుగుల జాబితాలో రోహిత్ శర్మ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు. అతడి బ్యాటింగ్ సగటు మాత్రం అందరిలో అత్యుత్తమం (58.57). కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లోనే 410 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌కు భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉంది. ఈ సిరీస్‌లో అతడు చెలరేగితే ద్రవిడ్ రికార్డు దిశగా దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు.

 

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగుల జాబితా..

  • రాహుల్ ద్రవిడ్ – 20 మ్యాచ్‌లు, 648 పరుగులు
  • సచిన్ టెండూల్కర్ – 17 మ్యాచ్‌లు, 639 పరుగులు
  • ఎంఎస్ ధోనీ – 18 ఇన్నింగ్స్‌, 613 పరుగులు
  • విరాట్ కోహ్లీ – 16 ఇన్నింగ్స్‌, 581 పరుగులు
  • సౌరవ్ గంగూలీ – 16 ఇన్నింగ్స్‌లు, 565 పరుగులు
  • యువరాజ్ సింగ్– 14 ఇన్నింగ్స్‌లు, 498 పరుగులు
  • రోహిత్ శర్మ – 10 ఇన్నింగ్స్‌లు, 410 పరుగులు
RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!