Wednesday, July 15, 2026
Homeఅంతర్జాతీయంహోర్ముజ్ టోల్ ఫీజుపై వెనక్కు తగ్గిన ట్రంప్

హోర్ముజ్ టోల్ ఫీజుపై వెనక్కు తగ్గిన ట్రంప్

📰 Generate e-Paper Clip

హోర్ముజ్‌లో టోల్ ఫీజు విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. అమెరికాతో భారీ వాణిజ్యం, పెట్టుబడుల కోసం గల్ఫ్‌ దేశాలతో కుదుర్చుకోనున్న ఒప్పందాలతో టోల్‌ ఫీజును భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

హోర్ముజ్‌లో టోల్ ఫీజు విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. భారీ వాణిజ్యం, పెట్టుబడుల కోసం తాము గల్ఫ్‌ దేశాలతో కుదుర్చుకోనున్న ఒప్పందాలతో టోల్‌ ఫీజును భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టు పెట్టారు. హోర్ముజ్‌లో ఇరాన్ నౌకలపై ఆంక్షలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని అన్నారు. మిగతా దేశాల నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. హోర్ముజ్‌కు రక్షణ బాధ్యతలు తీసుకున్న అమెరికా మిలిటరీని ప్రశంసించారు.

గల్ఫ్ దేశాల పాలకులతో చర్చల అనంతరం టోల్ ఫీజు ప్లాన్‌ను ఉపసంహరించుకున్నట్టు ట్రంప్ చెప్పారు. అమెరికాతో వాణిజ్యం పెట్టుబడుల విషయంలో గల్ఫ్ దేశాలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. ఇది అమెరికాకు, గల్ఫ్ దేశాలకూ లాభిస్తాయని అన్నారు. ఈ ఒప్పందాల తరువాత అమెరికాలో భారీ స్థాయిలో ఫ్యాక్టరీలు ఏర్పాటవుతాయని అన్నారు. వేల కొద్దీ జాబ్స్ అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. హోర్ముజ్ విషయంలో కీలక పాత్ర పోషించిన మంత్రులు పీటర్ హెగ్‌సెత్ , త్రివిధ దళాధిపతులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!