Wednesday, August 5, 2026
Homeస్పోర్ట్స్సీఎస్కేకి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై

సీఎస్కేకి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై

📰 Generate e-Paper Clip

చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీంతో సీఎస్కేతో ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది.

 చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీంతో సీఎస్కేతో ఉన్న అతడికి ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది. 2023లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై.. ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఫ్లెమింగ్ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఫ్రాంచైజీ, ఫ్లెమింగ్ పరస్పర చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్కే వెల్లడించింది.

‘సీఎస్కే-ఫ్లెమింగ్‌ది ఓ గొప్ప భాగస్వామ్యం. సుదీర్ఘ చర్చల అనంతరం పరస్పర గౌరవం, కృతజ్ఞతలతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాల్లో ఒకదానికి తెరపడింది’ అని సీఎస్కే ప్రకటనలో పేర్కొంది. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఆటగాడిగా సీఎస్కేలో చేరిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. 2009లో ప్రధాన కో‌చ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి చెన్నైను విజయపథంలో నడిపించాడు. ఫ్లెమింగ్ నేతృత్వంలోని సీఎస్కే ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లు గెలుచుకుంది. రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై.. 10 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఘనతను కూడా సొంతం చేసుకుంది.

సీఎస్కేను వీడటంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.. ‘క్రీడల్లో 18 ఏళ్లు అంటే ఒక జీవితకాలం లాంటిది. సీఎస్కేతో గడిపిన సమయం నా కోచింగ్ కెరీర్‌లో అత్యంత గొప్ప అనుభవం. ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాం.. క్లిష్ట పరిస్థితులను అధిగమించాం.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకున్నాం. సీఎస్కే ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగానే ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ జట్టు విజయాలను అభిమానిగా ఆస్వాదిస్తూనే ఉంటాను’ అని తెలిపాడు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!