Tuesday, October 27, 2026
Homeక్రైమ్ న్యూస్కారు ఢీకొని ఆటో బోల్తా.. మహిళ మృతి

కారు ఢీకొని ఆటో బోల్తా.. మహిళ మృతి

📰 Generate e-Paper Clip

  • భర్తకు తీవ్ర గాయాలు.. కొత్తగూడెం శివారులో ప్రమాదం

మాడ్గులపల్లి, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న దంపతులు ఈ ప్రమాదానికి గురయ్యారు. మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామ శివారులోని ఓ విడిది హోటల్‌ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన కుంభ వెంకటేశ్వర్లు, ఆయన భార్య కుంభ కోటేశ్వరి (42) హైదరాబాద్‌ నుంచి ఆటో (టీఎస్‌ 13 టీ 9080)లో స్వగ్రామానికి బయలుదేరారు. మంగళవారం మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని విడిది హోటల్‌ సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన హోండా కారు (ఏపీ 16 ఈహెచ్‌ 8088) ఆటోను బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్‌కు చెందిన హర్షవర్ధన్‌ అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కారు ఢీకొట్టిన వేగానికి ఆటో రెండు పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. కోటేశ్వరి తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో కోటేశ్వరి మృతి చెందింది.

మృతురాలికి భర్తతోపాటు కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాడ్గులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!