కారు ఢీకొని ఆటో బోల్తా.. మహిళ మృతి
భర్తకు తీవ్ర గాయాలు.. కొత్తగూడెం శివారులో ప్రమాదం మాడ్గులపల్లి, అక్టోబర్ 27 (చైతన్యగళం): వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న దంపతులు ఈ ప్రమాదానికి గురయ్యారు. మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామ శివారులోని ఓ విడిది హోటల్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు...