Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్జీలకుంటలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

జీలకుంటలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

  • గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం

పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 16 (చైతన్యగళం): గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. ఓదెల మండలం జీలకుంట గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జీలకుంట గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులు, తారు రహదారి, విద్యుద్దీపాల ఏర్పాటుకు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు.

ఓదెల మండలంలో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. గ్రామాల పరిశుభ్రతను కాపాడటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, చెత్తాచెదారాన్ని రహదారులపై వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వివిధ గ్రామాల సర్పంచులు, సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!