జీలకుంటలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 16 (చైతన్యగళం): గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. ఓదెల మండలం జీలకుంట గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని...