Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటు హర్షణీయం

హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటు హర్షణీయం

📰 Generate e-Paper Clip

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్‌ఎస్‌యూఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ కృతజ్ఞతలు

హుస్నాబాద్‌, అక్టోబర్ 16 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంపై ఎన్‌ఎస్‌యూఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ కృషితో ఈ అకాడమీ ఏర్పాటు కావడం నియోజకవర్గ క్రీడాకారులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.

యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు ఈ అకాడమీ దోహదపడుతుందని విశ్వతేజ తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు కానున్న అకాడమీలో మొత్తం 40 మంది క్రీడాకారులకు అవకాశం కల్పించనున్నారని, ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలు ఉంటారని వివరించారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా కబడ్డీ శిక్షకులను నియమించనున్నట్లు తెలిపారు.

ఈ అకాడమీ ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువతకు కబడ్డీలో శిక్షణ పొందేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. బాలురు, బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు.

హుస్నాబాద్‌ ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ అకాడమీ ఏర్పాటు కీలక ముందడుగు అని కూన విశ్వతేజ అభిప్రాయపడ్డారు. క్రీడాకారులకు కొత్త అవకాశాలు కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!