హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటు హర్షణీయం

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్‌ఎస్‌యూఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ కృతజ్ఞతలు హుస్నాబాద్‌, అక్టోబర్ 16 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంపై ఎన్‌ఎస్‌యూఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ కృషితో ఈ అకాడమీ ఏర్పాటు కావడం నియోజకవర్గ క్రీడాకారులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు...