Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్బతుకమ్మ ఘాట్లను పరిశీలించిన డీఆర్డీఓ జయదేవ్ ఆర్య

బతుకమ్మ ఘాట్లను పరిశీలించిన డీఆర్డీఓ జయదేవ్ ఆర్య

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 16 (చైతన్యగళం):

హుస్నాబాద్ మండలం తోటపల్లి, గాంధీనగర్ ఉమ్మడి గ్రామాల్లో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న ఘాట్లను సిద్దిపేట జిల్లా డీఆర్డీఓ జయదేవ్ ఆర్య పరిశీలించారు. ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసే సమయంలో మహిళలు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఘాట్ల వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి, గాంధీనగర్ గ్రామాల సర్పంచులు పోలు సంపత్, బంక లక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చందు, ఎంపీఓ రమేష్, పంచాయతీరాజ్ ఏఈ రవిచంద్ర, టెక్నికల్ అసిస్టెంట్ పర్షరాములు గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!