బతుకమ్మ ఘాట్లను పరిశీలించిన డీఆర్డీఓ జయదేవ్ ఆర్య
హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 16 (చైతన్యగళం): హుస్నాబాద్ మండలం తోటపల్లి, గాంధీనగర్ ఉమ్మడి గ్రామాల్లో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న ఘాట్లను సిద్దిపేట జిల్లా డీఆర్డీఓ జయదేవ్ ఆర్య పరిశీలించారు. ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసే సమయంలో మహిళలు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఘాట్ల వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి...