Friday, October 16, 2026
Homeఆంధ్రప్రదేశ్నందికొట్కూరు కూటమి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మొల్ల సబేరునిస

నందికొట్కూరు కూటమి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మొల్ల సబేరునిస

📰 Generate e-Paper Clip

  • మహిళలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం: మొల్ల సబేరునిస

నందికొట్కూరు, అక్టోబర్‌ 15 (చైతన్యగళం‌):

నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మొల్ల జాకీర్‌ హుస్సేన్‌ (అడ్వకేట్‌) భార్య మొల్ల సబేరునిసను కూటమి నాయకులు ఎంపిక చేశారు. టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆమె పేరును చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఈ సందర్భంగా మొల్ల సబేరునిస మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎంపిక చేసిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనను గెలిపిస్తే తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు.

ముఖ్యంగా తాగునీటి సమస్యను పరిష్కరించడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, సీసీ రహదారుల నిర్మాణం చేపట్టడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. మహిళలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కూటమి నాయకుల సూచనలు, సహకారంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నందికొట్కూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని మొల్ల సబేరునిస స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!