నందికొట్కూరు కూటమి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మొల్ల సబేరునిస

మహిళలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం: మొల్ల సబేరునిస నందికొట్కూరు, అక్టోబర్‌ 15 (చైతన్యగళం‌): నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మొల్ల జాకీర్‌ హుస్సేన్‌ (అడ్వకేట్‌) భార్య మొల్ల సబేరునిసను కూటమి నాయకులు ఎంపిక చేశారు. టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆమె పేరును చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ సందర్భంగా మొల్ల సబేరునిస మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎంపిక చేసిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు...