Thursday, October 15, 2026
Homeఆంధ్రప్రదేశ్గుట్టపాడులో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ కార్యకర్తలు

గుట్టపాడులో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ కార్యకర్తలు

📰 Generate e-Paper Clip

  • కండువాలు కప్పి ఆహ్వానించిన కాటసాని రామభూపాల్‌రెడ్డి

పాణ్యం, అక్టోబర్‌ 15 (చైతన్యగళం‌):

పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, సుంకిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్‌రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజల పట్ల పార్టీ నిబద్ధతపై విశ్వాసంతో వైఎస్సార్‌సీపీలో చేరిన వారందరికీ స్వాగతం పలికారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన జంగం రెడ్డి, మల్దీ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు స్వాములు, చిన్న బజారి, నాగార్జున, బాల నాగిరెడ్డి, మౌలాలి, పుల్లయ్య, నడిపి జయన్న, రవి, గౌండా మాబాషా, వెంకటేష్‌, కన్నా బాబు, ఎం. గోపాల్‌తోపాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!