- సీఎండీ వరుణ్‌రెడ్డికి కాంగ్రెస్ నాయకుల వినతి
మంథని, అక్టోబర్ 14 (చైతన్యగళం):మంథని నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బుధవారం హనుమకొండలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ఐఏఎస్‌కు వినతిపత్రం అందించారు.
నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, పంటలకు అవసరమైన విద్యుత్‌ను అందించాలని నాయకులు కోరారు. దీనిపై స్పందించిన సీఎండీ, అదనంగా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ అంశంపై నిరంతరం సూచనలు చేస్తున్నారని సీఎండీ పేర్కొన్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఈసీసీ సభ్యుడు శశిభూషణ్ కాచే, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కుడుదుల వెంకన్న తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
