Saturday, October 31, 2026
Homeతెలంగాణకరీంనగర్రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి

రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి

📰 Generate e-Paper Clip

  • లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి.. కోహెడలో బీఆర్‌ఎస్‌ ర్యాలీ, విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం

హుస్నాబాద్‌, అక్టోబరు 8 (చైతన్యగళం): రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు లోవోల్టేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు గురువారం కోహెడలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించి విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం నిరంతర సరఫరా జరగడం లేదని ఆరోపించారు. మండలంలోని పలు గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, రోజుకు 20 నుంచి 30 సార్లు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. సింగిల్‌ఫేజ్‌ సరఫరా కూడా సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ పెరియాల దేవేందర్‌రావు, మాజీ జడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్‌, మండల వైస్‌ ఎంపీపీ తడికల రాజిరెడ్డి, సర్పంచులు ఆరేపల్లి బాబు, గుండారెడ్డిపల్లె బాబు, మాజీ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్‌, నాయకులు కొక్కుల సురేష్‌, గవ్వ వంశీధర్‌రెడ్డి, అబ్దుల్‌ రహీం, కుమారస్వామి, జలగం శంకర్‌, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!