రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి

లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి.. కోహెడలో బీఆర్‌ఎస్‌ ర్యాలీ, విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం హుస్నాబాద్‌, అక్టోబరు 8 (చైతన్యగళం): రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు లోవోల్టేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు గురువారం కోహెడలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించి విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ...