- నాసర్లపల్లి–గోడకొండ్ల మధ్య పైప్‌లైన్ మరమ్మతు పనులు
హైదరాబాద్, అక్టోబర్ 5 (చైతన్యగళం): హైదరాబాద్ మహానగరానికి కృష్ణా తాగునీటి సరఫరా పథకం రెండో దశలో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 మి.మీ. వ్యాసం కలిగిన ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, కవాటాల మార్పిడితో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీని అరికట్టే పనులు నిర్వహించనున్నారు.
ఈ పనులు అక్టోబర్ 5 సోమవారం ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 6 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటలపాటు కొనసాగనున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోవడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డినగర్, ఉప్పల్, నాచారం, హెచ్ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం), హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం), పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్పేట్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ (పాక్షికం).
మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
