- పట్టభద్రుల ఓటు నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ
మిర్యాలగూడ, అక్టోబర్ 5 (చైతన్యగళం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఓటు నమోదు తదితర అంశాలపై చర్చించారు.
సమావేశంలో దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొర్ర నాగునాయక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఆర్ అనుచరులు తదితరులు పాల్గొన్నారు.
