హైదరాబాద్‌లో 36 గంటలపాటు పలు ప్రాంతాలకు తాగునీటి అంతరాయం

నాసర్లపల్లి–గోడకొండ్ల మధ్య పైప్‌లైన్‌ మరమ్మతు పనులు హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): హైదరాబాద్‌ మహానగరానికి కృష్ణా తాగునీటి సరఫరా పథకం రెండో దశలో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 మి.మీ. వ్యాసం కలిగిన ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌పై మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దెబ్బతిన్న ఎంఎస్‌ ఎయిర్‌ టీస్‌, కవాటాల మార్పిడితో పాటు స్కవర్‌ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీని అరికట్టే పనులు నిర్వహించనున్నారు. ఈ పనులు అక్టోబర్‌ 5 సోమవారం ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్‌ 6 మంగళవారం సాయంత్రం...