Thursday, October 29, 2026
Homeఆంధ్రప్రదేశ్కర్నూలుపెంచికలపల్లిలో ఎస్‌ఎంసీ నూతన కార్యవర్గం ఎన్నిక

పెంచికలపల్లిలో ఎస్‌ఎంసీ నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

  • చైర్మన్‌గా జే. శివపార్వతి.. వైస్‌ చైర్మన్‌గా బి. ఎల్లనాగేంద్ర ఏకగ్రీవం

పాములపాడు, అక్టోబర్‌ 5 (చైతన్యగళం‌): పాములపాడు మండలం పెంచికలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సోమవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌గా జే. శివపార్వతి, వైస్‌ చైర్మన్‌గా బి. ఎల్లనాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ, పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కమిటీ సభ్యులను గ్రామస్థులు, తల్లిదండ్రులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

పాఠశాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ-2 బి. గోపాల్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎం.వి. రమణ, ఎం. షేక్‌షావలి, గ్రామ నాయకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!