Saturday, October 3, 2026
Homeతెలంగాణకరీంనగర్నవభారత్‌ విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు

నవభారత్‌ విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించిన ఇద్దరు విద్యార్థులు

హుస్నాబాద్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): హుస్నాబాద్‌ పట్టణంలోని నవభారత్‌ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో చదివిన ఇద్దరు విద్యార్థులు ఎంబీబీఎస్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించారు. లింగంపల్లి మల్లికార్జున్‌రావుకు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో, బెజ్జంకి నీలిమకు జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు లభించాయి.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ గంగరవేణి రవి విద్యార్థులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులు వైద్య విద్యలో సీట్లు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!