Friday, October 2, 2026
Homeతెలంగాణవరంగల్రెడ్‌క్రాస్‌ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలి

రెడ్‌క్రాస్‌ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలి

📰 Generate e-Paper Clip

  • పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు బీజేపీ నాయకుల సన్మానం

వర్ధన్నపేట , అక్టోబరు 1 (చైతన్యగళం): రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి నిరుపేదలు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ వన్నాల వెంకటరమణ ఆకాంక్షించారు.

ఇటీవల వరంగల్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలకమండలి సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మీ గణపతి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్‌ గజవెల్లి రాజ్‌కుమార్‌ను బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో వైద్య సేవలు, రక్తదానం, ఆరోగ్య అవగాహన, విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలను మరింత విస్తృతంగా చేపట్టాలని వారు కోరారు. సమాజ సేవ పట్ల నిబద్ధతతో పనిచేసి సంస్థకు మరింత సేవాభావాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు కొండేటి సత్యం, మండల అధ్యక్షుడు అడుప రాజు, బీజేవైఎం నాయకుడు మహంత్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!