Friday, October 2, 2026
Homeతెలంగాణవరంగల్వరంగల్‌ సీపీ శ్వేతను కలిసిన రెడ్‌క్రాస్‌ నూతన పాలకవర్గం

వరంగల్‌ సీపీ శ్వేతను కలిసిన రెడ్‌క్రాస్‌ నూతన పాలకవర్గం

📰 Generate e-Paper Clip

  • సేవా కార్యక్రమాలపై చర్చ.. సీపీకి ఘన సన్మానం

వరంగల్‌ ప్రతినిధి, అక్టోబరు 1 (చైతన్యగళం): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వరంగల్‌ జిల్లా నూతన చైర్మన్‌ బేతి అశోక్‌బాబు ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేతను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై సీపీతో చర్చించారు. అనంతరం శ్వేతను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ శనబోయిన రాజ్‌కుమార్‌, కోశాధికారి బోల్లం శివ, పాలకమండలి సభ్యులు కుసుమ సత్యనారాయణ, మండల పరిష రాములు, వద్దిరాజు, పుల్లూరి ప్రవీణ్‌కుమార్‌, తిరుపతిరెడ్డి, చొప్పరి సోమయ్య, ముల్క ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!